కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం: పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
పెద్దపల్లి, సెప్టెంబర్ 03:
పెద్దపల్లి జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గురువారం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితో జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మండల అధ్యక్షుల పేర్లను వెల్లడించినట్లు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు కీలకపాత్ర పోషించాలని ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. నూతన మండల అధ్యక్షుల నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐలి ప్రసాద్, మంథని–ముత్తారం మండలానికి దొడ్డ బాలాజీ, రామగిరి మండలానికి తులసీరాం గౌడ్, కమాన్పూర్ మండలానికి సయ్యద్ అన్వర్ లను నియమించారు. పెద్దపల్లి మండలానికి కట్కూరి సుధాకర్ రెడ్డి, ఓదెల మండలానికి మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ మండలానికి గజవేన సదయ్య, సుల్తానాబాద్ మండలానికి చిలుక సతీష్, ఎలిగేడు మండలానికి సామ రాజేశ్వర్ రెడ్డి, జూలపల్లి మండలానికి బొజ్జ శ్రీనివాస్ లను మండల అధ్యక్షులుగా ప్రకటించారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం మండల అధ్యక్షుడిగా సింగం కిరణ్, పాలకుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ లను నియమించారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండల అధ్యక్షుడిగా రూపేష్ నాయక్ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు.
నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు పార్టీ అందిస్తున్న సేవలు, కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా సంస్థాగతంగా పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.
Uploaded Video:


