Friday, 4 September 2026
  • Home  
  • సెప్టెంబరు 6న మార్కాపురంలో రాజ్యాంగ పరిరక్షణ సభ: జయప్రదం చేయాలని మాల సంఘాల జేఏసీ పిలుపు
- నంద్యాల

సెప్టెంబరు 6న మార్కాపురంలో రాజ్యాంగ పరిరక్షణ సభ: జయప్రదం చేయాలని మాల సంఘాల జేఏసీ పిలుపు

నంద్యాల : ఈ నెల 6వ తేదీన మార్కాపురంలో నిర్వహించనున్న ‘రాజ్యాంగ పరిరక్షణ సభ’ను జయప్రదం చేయాలని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలో సభకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆయన నాయకులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా నలుమూలల నుంచి అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నాయకులు, మహిళా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ కుమార్, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంచర్ల రాజేష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ బాబు హాజరుకానున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.సి. పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.