సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం జిల్లా వ్యాప్త నిరసనలు:Tptf రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీనివాస్
—————————————————————-
ఉద్యోగ ఉపాధ్యాయ మిగతా కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ TGEJAC పిలుపు మేరకు సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు , కార్యాలయాలు ముందర ఉద్యోగ, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ గానుగు పహాడ్ ఉన్నత పాఠశాల నుండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా
సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధాన్ని పునరుద్దలించాలనీ , పెండింగ్ లో ఉన్న ఆరు డి ఎ లను వెంటనే విడుదల చేయాలని, మూడు సంవత్సరాలుగా సాగతీస్తున్న పిఆర్సి ని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ పెన్షనర్లకు ఎలాంటి చెల్లింపులు సమగ్ర హెల్త్ కార్డు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
డి.శ్రీనివాస్
టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు


