-నెల్లూరు జిల్లా సంగం మండలంలో ‘టీబి ముక్తభారత్ 2.0’ లో భాగంగా అత్యాధునిక హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే కార్యక్రమం నిర్వహించారు.
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెరమణా సబ్ సెంటర్ లో జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ ఖాదర్ వలీ ఆదేశాలతో సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో టీబి ముక్తభారత్ 2.0 కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రజలకు లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రజల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి దగ్గు,జ్వరము బరువు తగ్గిపోవడంవంటి లక్షణాలు కనిపించిన వెంటనే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.అధునాతనమైన హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే పరీక్షలు నిర్వహించడంలో పది నిమిషములలో టీబి ఉందో లేదో నిర్ధారిస్తారన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఈ ఎక్స్రేలు తీయించుకొని వ్యాధి ఉందో లేదో నిర్ధారించుకున్నారు. ఒకవేళ టీబీ ఉన్న మెడల ఆ మరుసుటి రోజు నుండి మందులు ఆశా వాలంటరీ పర్యవేక్షణలో ఆరు నెలల కోర్సు మందులు మింగిస్తారు. ఇదేవిధంగా మండలంలో దువ్వూరు,పడమటిపాలెం, సంగం,పెరమణా గ్రామాలలో ఈ కార్యక్రమంలో నిర్వహించామన్నారు. హైరిస్క్ ఏరియాలలో గ్రామానికి 100 ఎక్స్రేలు తీశారు రెండో విడతగా ప్రతి గ్రామములో 14 సంవత్సరాల పైబడిన వారందరికీ ఈ ఎక్స్రేలు తీస్తారని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాబ్ టీబిసూపర్వైజర్ నరసింహులు, బుచ్చి యూనిట్ ఎస్ టి ఎస్ సురేష్, సూపర్వైజర్, స్టాప్ ఎంఎల్ హెచ్ పి లు , హెల్త్ అసిస్టెంట్ ఏ ఎన్ ఎం లు ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు.


