ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతి నిధి)
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి ఖమ్మం జిల్లా సమావేశం జిల్లా కన్వీనర్ వెల్పుల సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హర్ ఘర్ తిరంగా వరంగల్ జోన్ కన్వీనర్ గళ్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గెంటెల, డోకుపర్తి రవీంద్ర కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. జిల్లా కో-కన్వీనర్ కళ్లెం విజయరెడ్డి, అనంతు ఉపేందర్‌రావు, దీకొండ శ్యాంసుందర్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.


