ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతి నిధి)
పామాయిల్ సాగు విస్తీర్ణం తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో పామాయిల్ మొక్కలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ ఫెడ్ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్‌లో మొక్కల కొరత ఉంటే ప్రైవేట్ నర్సరీల నుంచి కొనుగోలు చేసి రైతులకు వెంటనే సరఫరా చేయాలని, పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.


