Sunday, 24 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీ కాళహస్తి, మే 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని 34వ వార్డులోని శ్రీరామ మందిరంలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో సుమారు 80 మంది రోగులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన ఆప్తాల్మిక్ అధికారి జయచంద్రప్ప మాట్లాడుతూ, పరీక్షలు చేయించుకున్న వారిలో 17 మందికి కంటి శుక్లాలు, ఐదుగురికి టెర్రిజియం (కంటిపై పొర) సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ శుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రసీదులు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శిబిరానికి వచ్చిన రోగులకు శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి చేతుల మీదుగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయచంద్రప్ప మాట్లాడుతూ, సమాజ సేవలో మునికృష్ణారెడ్డి ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ప్రజలకు భగవద్గీత పుస్తకాలను కూడా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక పెద్దలు రత్నం రెడ్డి, దామోదర్ రెడ్డి, స్వాతి, లలిత, బండారుపల్లి భాస్కర్ రెడ్డి, జానకిరామానాయుడు, పుదూరు జనార్దన్ రెడ్డి, హరికృష్ణ, పుదూరు సురేష్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఢిల్లీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.