బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం సెప్టెంబరు ,2,(పున్నమి ప్రతినిధి)
శిరీషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు భూక్యా స్వాతి, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోలా హరీష్, యువమోర్చా నాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు మెడికల్ కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై శిరీషకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు



