పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 03)
వేముల: వేముల మండలంలోని వేముల గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాలో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను గురువారం గ్రామసభలో చదివి వినిపించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను ప్రజలకు తెలియజేసి, సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.






