ఆంధ్ర పాలకులు నీటిని దోచుకుంటున్నారు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సెప్టెంబర్ 3
ఖమ్మం:
కృష్ణా, గోదావరి నదీ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ పాలకులు అక్రమంగా నీటిని తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా దోచుకున్న దాని కంటే ఎక్కువగా ప్రస్తుతం నీటి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్ర పాలకుల నీటి దోపిడీ వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు తేల్చకుండా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరుగుతోందన్నారు.


