అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం వేగివారిపాలెం గ్రామంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిజిటల్ ఇండియా, 5జీ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పటికీ.. తమ గ్రామంలో కనీసం ఫోన్ మాట్లాడేందుకు కూడా సరైన సిగ్నల్ అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర సమయంలో 100, 108కు కాల్ చేయాలన్నా గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చే యువత సైతం సిగ్నల్ కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కొందరు పెద్ద కర్రలకు రూటర్లను కట్టి సిగ్నల్ కోసం ప్రయత్నించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఒక్క సిగ్నల్ పాయింట్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులు తక్షణం స్పందించి వేగివారిపాలెం గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో పప్పుల సాయిరాం, వానరాసి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


