వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా కొనసాగించారు. “జై చంద్రన్న – జై జై చంద్రన్న” నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని పండుగలా జరిపారు.



