అన్నా క్యాంటీన్ ల వద్ద పండుగలా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు .
నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడి 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు స్టోన్ హౌస్ పేట ఆర్.ఎస్.ఆర్ స్కూల్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు . సామాన్య ప్రజలతో పాటుగా క్యూలైన్‌లో వచ్చి అన్నా క్యాంటీన్ భోజనాన్ని అందరితో కలిసి కూర్చుని భుజించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన ఆశయమని, దానికి నిదర్శనమే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయల భారీ విరాళంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాలని కొనియాడారు. మంత్రి నారాయణ పిలుపు మేరకు సిటీ లోని అన్ని అన్నా క్యాంటీన్లలో టీడీపీ నేతలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ ,నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ,కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ,టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు .



