వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన పులిగిల్ల కార్తీక్. కి తను చేసిన సేవలకు గాను ధూమ్ డ్యాన్స్ స్టూడియో మరియు ప్రగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భారత్ కళావైభవ అవార్డు అందజేయడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా తను ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ తనతో పాటు మిగతా పేద అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని సోల్జర్స్ గ్రూపు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పేద అభ్యర్థులకు గైడెన్స్ ఇస్తూ,పుస్తకం కొనలేని పరిస్థితిలో ఉన్న పేద అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేసి వారిని ఉద్యోగస్తులుగా తీర్చినందుకుగాను హైదరాబాద్ నగరంలోని బిర్లా టెంపుల్ దగ్గర్లో ఉన్న భాస్కర్ ఆడిటోరియంలో తనకి భారత్ కళావైభ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సోల్జర్స్ గ్రూప్ ఫౌండర్ చౌహన్ కృష్ణ,ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కల్వకుర్తి అరీపుదిన్,ధూమ్ డాన్స్ స్టూడియో స్థాపకులు అజీమ్ మరియు రాష్ట్రపతి అవార్డు పొందిన సాజిద ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



