పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల హాజరు, గత ఫలితాలు, సిలబస్ పూర్తి, అభ్యసన లోపాలు, తదుపరి నెల పాఠ్య ప్రణాళికపై సమీక్షించారు.
జీసీడీవో పుష్ప, ఎంఈఓలు ఖాజా మొయిద్దీన్, ఈశ్వరయ్య పర్యవేక్షణలో ఎస్‌జీటీలకు Guaranteed FLN, 100 శాతం స్ట్రీమ్ పాఠశాలలు, యాక్షన్ ప్లాన్, ఎండ్‌లైన్ పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. అలాగే Mission March SSC–2027లో భాగంగా సి, డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి, ఫలితాల విశ్లేషణ, పరీక్షలకు త్వరిత పునశ్చరణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని అధికారులు సూచించారు.



