మంగళవారి పేట గ్రామం, ఖానాపురం మండలం, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా.
*మంగళవారి పేట నుండి తండాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. అర్థం చేసుకోండి బాగు చేయండి.
*తండాలకు బిటి రోడ్లు వెంటనే వేయాలనీ రోడ్డు ఎక్కిన గిరిజన యువత…*
*అర్ధాంతరంగా రోడ్ల నిర్మాణం చేయకుండా ఆపడం కాంట్రాక్టర్ వైఫల్యం.. స్థానిక ఎమ్మెల్యే అడ్డగింపా…*
*జాతీయ రహదారి దిగ్బంధం.. మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ. నాయకులు ఖానాపూర్ మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారు మరియు గ్రామ సర్పంచులు మాట్లాడుతూ.
ఖానాపురం మండలంలోని జాతీయ రహదారి మంగళవారిపేట గ్రామం నుండి లింకు రోడ్లు కొడితి మాట్ తండా, భద్రుతండా, మార్నగిబోడు తండా, గ్రామపంచాయతీలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మంజూరు చేసిన బీటీ రోడ్లను నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి గిరిజనులకు కనీసం రోడ్డు సౌకర్యం లేకుండా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నాడని మండిపడుతూ యువత ఆధ్వర్యంలో నేడు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇట్టి ధర్నా కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.
తండాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు జాతీయ రహదారికి కలుపుతూ లింకు రోడ్లకు బీటి పనులను తీసుకువచ్చి టెండర్లకు పిలిస్తే నేడు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అట్టి టెండర్లను రద్దుచేసి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
అర్ధాంతరంగా రోడ్ల నిర్మాణం చేయకుండా ఆపడం కాంట్రాక్టర్ వైఫల్యం.. స్థానిక ఎమ్మెల్యే అడ్డగింపా… ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తండాలకు మంజూరైన రోడ్లను వేయించాలని ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారిని స్థానిక అధికార పార్టీ నాయకులతో కలిస్తే మీ తండాలకు రోడ్లు ఎందుకు అంటూ ఎగతాళి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని అవహేళన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు చేసి హుందాతనం ప్రదర్శించాల్సిన ఎమ్మెల్యే తండా గిరిజనులను హీనంగా చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బిటి రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన టెండర్లను రద్దు చేశారా.. లేక ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలుకావస్తున్న నేటి వరకు కాంట్రాక్టర్ పోసిన కంకర అక్కడే ఉందని.. రోడ్డు మాత్రంపడడంలేదనిదీన్నిఅడ్డుపడుతున్నదుర్మార్గులకుత్వరలోనేతండాప్రజలచేతిలోగుణపాఠంతప్పదనిహెచ్చరించారు.పదిరోజుల్లోగాస్థానికఎమ్మెల్యేఅధికారులుస్దించరోడ్డువేయాలనిలేకుంటేమంగళవారిపేటఉమ్మడిగ్రామపంచాయతీ పరిధిలోని 9 తండాలప్రజలంఅందరంకలిసిజాతీయరహదారిని దిగ్బంధించి గిరిజనుల సత్తా చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ధర్మారావుపేట సర్పంచ్ మడ్రాజు వెంకన్న, భద్రూతండ సర్పంచ్ బానోత్ వీరన్న, మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత, కొడితి మాట్ తండా సర్పంచ్ లకావత్ వసంత ప్రవీణ్, నాజితండ. సర్పంచ్ బాదావత్ జ్యోతి బాలకిషన్, మంగళ వారి పేట ఉపసర్పంచ్ భూష బోయిన రాజు మాజీ జెడ్పిటిసిలు గుగులోతు బాలు నాయక్, బత్తిని స్వప్న బీసీ సెల్ అధ్యక్షులు కోరే సుధాకర్ యూత్ అధ్యక్షుడు బానోత్ శ్రీనివాస్ మండల నాయకులు బుస అశోక్, బందారపు శ్రీనివాస్, ఓర్సు రవి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రాము గ్రామాల యువత బాలకృష్ణ, కుమార్, సురేష్, అశోక్, సంతోష్, లక్ష్మణ్, రమేష్, రాజు, మురళి, అశోక్, ఉప్పలయ్య, రామ్మూర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
