Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం

Punnami Newsroom Published:
మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం

Story highlights

  • మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) చెన్నరావుపేట మండలం గ్రామం అమీనాబాద్, స్థానిక మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి గారి అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థుల…
  • 10వ తరగతి క్లాస్ టీచర్లు శ్రీ నల్లతీగల యాకయ్య మరియు శ్రీ మాటూరి సూరిబాబు గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై పలు కీలక అంశాలను చర్చించారు.
  • ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి గారు మాట్లాడుతూ..

మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) చెన్నరావుపేట మండలం గ్రామం అమీనాబాద్, స్థానిక మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి గారి అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 10వ తరగతి క్లాస్ టీచర్లు శ్రీ నల్లతీగల యాకయ్య మరియు శ్రీ మాటూరి సూరిబాబు గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై పలు కీలక అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి గారు మాట్లాడుతూ.. “విద్యార్థుల భవిష్యత్తుకు 10వ తరగతి అత్యంత కీలకం. ఇటీవలే పూర్తయిన SA-1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్-1) పరీక్షల మార్కులను విశ్లేషించి, ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయడం జరిగింది. రాబోయే వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2వ తేదీ నుండి ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట చొప్పున ప్రత్యేక తరగతులు (Special Classes) నిర్వహిస్తున్నాము. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూస్తూ, పాఠశాలకు పూర్తి సహకారం అందించాలి” అని కోరారు.
అంతేకాకుండా ఆమె మరింత స్పష్టం చేస్తూ.. “విద్యార్థుల క్రమశిక్షణ, ఇంటి వద్ద వారు చదివే వాతావరణంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. పిల్లల దృష్టి మరలకుండా సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచడం చాలా అవసరం. మన ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో అదనపు సమయం కేటాయించి బోధిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు, అత్యధిక శాతం విద్యార్థులు 10/10 జీపీఏ(మంచి మార్కులు) సాధించి మన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.
10వ తరగతి ఆర్యభట్ట సెక్షన్ క్లాస్ టీచర్ శ్రీ నల్లతీగల యాకయ్య గారు మాట్లాడుతూ.. “చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాము. వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులు అమలు చేస్తూ, ప్రతిరోజూ వారి పురోగతిని పర్యవేక్షిస్తాము. ఉపాధ్యాయులు పాఠశాలలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, విద్యార్థులు ఇంటి వద్ద కూడా క్రమం తప్పకుండా చదివేలా తల్లిదండ్రులు అంతే బాధ్యతగా పర్యవేక్షించాలి” అని సూచించారు.
10వ తరగతి భాస్కరాచార్య సెక్షన్ క్లాస్ టీచర్ శ్రీ మాటూరి సూరిబాబు గారు మాట్లాడుతూ.. “SA-1 మార్కుల ఆధారంగా ప్రతి విద్యార్థికి ఎక్కడ మెరుగుపడాలో సూచనలు ఇస్తున్నాము. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మన పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా ఒక బృందంగా పని చేయాలి” అని అన్నారు.
అనంతరం జరిగిన ఇంటరాక్షన్ సెషన్‌లో తల్లిదండ్రుల అభిప్రాయాలను పంచుకున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీ ముత్తోజు నాగేంద్ర చారి గారు మాట్లాడుతూ.. “పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న ఉపాధ్యాయుల నిర్ణయం ఎంతో హర్షణీయం. మీ ఈ కృషికీ, సమయపాలనకూ తల్లిదండ్రుల తరఫున మా వంతు పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు.
మరో పేరెంట్ శ్రీమతి కారు రాజమణి గారు మాట్లాడుతూ.. “పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ, ప్రతి విద్యార్థికి సంబంధించిన SA-1 మార్కుల లోతైన విశ్లేషణ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా వెనుకబడిన పిల్లల కోసం మీరు తీసుకుంటున్న ఈ ప్రత్యేక చర్యలు వారిలో తప్పక మార్పును తీసుకువస్తాయి” అని సంతోషం వ్యక్తం చేశారు.
వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *