Friday, 25 September 2026
  • Home  
  • యలమంచిలిలో పేదల ఇంటి కలకు ఊతం.. 172 మందికి గృహ ప్రొసీడింగ్స్
- అనకాపల్లి

యలమంచిలిలో పేదల ఇంటి కలకు ఊతం.. 172 మందికి గృహ ప్రొసీడింగ్స్

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) అనకాపల్లి : యలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో నూతన గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పాల్గొని 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తనను 50 వేల మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.49 కోట్ల నిధులు తీసుకువచ్చామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

అనకాపల్లి : యలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో నూతన గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పాల్గొని 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తనను 50 వేల మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.49 కోట్ల నిధులు తీసుకువచ్చామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.