భైంసా: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నిర్మల్ జిల్లా కమిటీలో భైంసా మండలానికి చెందిన సిందె గంగాప్రసాద్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ప్రకటించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను పార్టీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని గంగాప్రసాద్ తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగాప్రసాద్
భైంసా: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నిర్మల్ జిల్లా కమిటీలో భైంసా మండలానికి చెందిన సిందె గంగాప్రసాద్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ప్రకటించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను పార్టీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని గంగాప్రసాద్ తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

