Friday, 25 September 2026
  • Home  
  • ప్రతి కదలికపై కన్ను.. పేటలో పోలీసుల ‘మెగా కవచం’*
- తిరుపతి

ప్రతి కదలికపై కన్ను.. పేటలో పోలీసుల ‘మెగా కవచం’*

*- 110 సీసీ కెమెరాలతో పట్టణంపై 24 గంటల నిఘా* *- ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మురళీకృష్ణ ప్రత్యేక చొరవ* *సూళ్లూరుపేట, సెప్టెంబరు 24 నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసు శాఖ.. సూళ్లూరుపేట పట్టణానికి నిఘా కవచాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు సీఐ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక చొరవతో పట్టణంలోని 50 కీలక ప్రాంతాల్లో 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లాంఛనంగా ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే కదలికలను 24 గంటలపాటు పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, దొంగతనాలు, గొలుసు దొంగతనాలు తదితర నేరాలను అరికట్టడంతో పాటు నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడనున్నాయి. అదే విధంగా పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులపై కూడా నిఘా కొనసాగనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద వీధి వైపు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ప్రజలు, వ్యాపారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ఈ నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. *కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.*

*- 110 సీసీ కెమెరాలతో పట్టణంపై 24 గంటల నిఘా*
*- ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మురళీకృష్ణ ప్రత్యేక చొరవ*

*సూళ్లూరుపేట, సెప్టెంబరు 24

నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసు శాఖ.. సూళ్లూరుపేట పట్టణానికి నిఘా కవచాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు సీఐ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక చొరవతో పట్టణంలోని 50 కీలక ప్రాంతాల్లో 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లాంఛనంగా ప్రారంభించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే కదలికలను 24 గంటలపాటు పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, దొంగతనాలు, గొలుసు దొంగతనాలు తదితర నేరాలను అరికట్టడంతో పాటు నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడనున్నాయి.

అదే విధంగా పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులపై కూడా నిఘా కొనసాగనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద వీధి వైపు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ప్రజలు, వ్యాపారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ఈ నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.

*కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.