Thursday, 17 September 2026
  • Home  
  • ​యలమంచిలి టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం ..
- అనకాపల్లి

​యలమంచిలి టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం ..

పున్నమి ప్రతినిధి : ​యలమంచిలి : పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ) అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల సేవలను గుర్తించి, వారికే కౌన్సిలర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడినే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టణ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివన్నారాయణ మూర్తి మాట్లాడుతూ… “అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పారిశ్రామిక పురోగతి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రెటరీ ఆడారి ఆదిమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్లి బాబురావు, టౌన్ ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి, బీసెట్ చిన్నారావు, పిల్ల గంగాధర్, తుంపాల గంగాధర్, భీముని సత్యనారాయణ, బి. అశోక్ కుమార్, నాగేంద్ర తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి :

​యలమంచిలి : పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ) అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల సేవలను గుర్తించి, వారికే కౌన్సిలర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడినే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టణ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివన్నారాయణ మూర్తి మాట్లాడుతూ… “అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పారిశ్రామిక పురోగతి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రెటరీ ఆడారి ఆదిమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్లి బాబురావు, టౌన్ ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి, బీసెట్ చిన్నారావు, పిల్ల గంగాధర్, తుంపాల గంగాధర్, భీముని సత్యనారాయణ, బి. అశోక్ కుమార్, నాగేంద్ర తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.