మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
నిర్మల్: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, దయ, సేవా భావాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి పండ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్మ్ రామ్ కిషన్ రెడ్డి . నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మురుగొండ రాము మరియు డాక్టర్ సుభాష్ రావు మైనార్టీ నాయకులు ఆయుఖాన్.ఇంతియాజ్. అజారుద్దీన్. రిజ్వాన్. జావిద్. మినాజ్. మరియు సోయాబ్ పాల్గొన్నారు


