మణిపూర్‌లో భద్రతా దళాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 67 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంఫాల్ వెస్ట్ ప్రాంతంలో దొంగిలించిన పోలీస్ ఆయుధాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో అధునాతన డ్రోన్ జ్యామర్ కూడా ఉండటం గమనార్హం. 2023లో జరిగిన జాతి ఘర్షణల సమయంలో వేలాది పోలీస్ ఆయుధాలు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 4,500కు పైగా ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

మణిపూర్‌లో భారీగా ఆయుధాల స్వాధీనం