Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, పెనగలూరు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.
  • ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
  • విగ్రహ ప్రతిష్ఠకు ముందుగా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, మండపాలు రహదారులు, ఫుట్‌పాత్‌లు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఏర్పాటు చేయరాదన్నారు.

తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, పెనగలూరు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ముందుగా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, మండపాలు రహదారులు, ఫుట్‌పాత్‌లు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఏర్పాటు చేయరాదన్నారు. విద్యుత్, అగ్నిమాపక, లైటింగ్, జనసమ్మర్ద నియంత్రణ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని సూచించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. రాజకీయ ప్రచారం, రెచ్చగొట్టే నినాదాలు, జూదం, లాటరీలు, మద్యం, బలవంతపు విరాళాల వసూళ్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు. నిమజ్జనానికి పోలీసుల అనుమతితో నిర్ణయించిన మార్గం, సమయం, ప్రదేశాన్ని మాత్రమే పాటించాలని తెలిపారు. ప్రధాన మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియాలో వివాదాస్పద సమాచారాన్ని ప్రచారం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *