కావలి బ్రిడ్జి సెంటర్ లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు బ్రిడ్జికి దక్షిణం వైపు ఉన్న మురికి కాలువను కొందరు నివాస పరులు ఆక్రమించి మురుగునీరు పోకుండా చేయడంతో గమనించిన కమిషనర్ వాటిని సిబ్బందిచే తొలగింప చేశారు. 28వ వార్డు ఇంచార్జ్ నున్న మురళి ఆధ్వర్యంలో సీ.ఐ ఫిరోజ్ , శానిటరీ అధికారి బషీర్ అక్కడ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఈ సందర్భంగా కోరారు. మురుగు కాలువల పారుదలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడాలని నున్న మురళి ఈ సందర్భంగా కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు



