**బాహ్య మూల్యాంకనం పేరుతో అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్న అధికారులు**
**విద్యారంగం పటిస్టత పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి**
**పాఠశాల విద్యాశాఖ ఏక పక్షనిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం.**
-TSUTF
———————————————————
జనగామ, ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణల పేరుతో అధికారులు కేవలం ప్రయోగాలకు పరిమితమైన విధానాలను రూపొందిస్తూ విద్యారంగాన్ని రోజురోజుకు దిగజారుస్తున్నారని TSUTF అభిప్రాయపడుతున్నది. విద్యాశాఖాధికారుల ఏకపక్ష నిర్ణయం ఫలితంగా అసంబద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారని TSUTF ఆరోపిస్తున్నాది. ఇదీవల బాహ్యమూల్యాంకనం పేరుతో తీసుకున్న నిర్ణయం కూడ ఈ అసంబద్ధ ఏకపక్ష నిర్ణయాలలో భాగమేనని TSUTF అభిప్రాయపడుతున్నది. విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు పెంచడానికి బోధన సక్రమంగా జరిగేటట్లు పర్యవేక్షణ వ్యవస్థను పెంపొందించడం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించడం అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతోపాటు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించుకొనేటే సహపాఠ్యకార్యక్రమాలపై దృష్టి సారించడం చేయాల్సిన అధికారులు ఆ వైపు కనీసం ఆలోచించకుండా పరీక్షల సంస్కరణల పేరుతో బాహ్యమూల్యాంకన విధానాన్ని తీసుకువచ్చారని అభిప్రాయపడుతున్నాది .
వాస్తవానికి ఈ విధానం అమలులో ఉండే సాధ్య అసాధ్యాలను ఏమాత్రం ఆలోచించినట్లుగా లేరు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేని సందర్భంలో ఆ ఉపాధ్యాయులు మండల కేంద్రానికి పేపర్ల మూల్యాంకనంకోసం వెళితే బడి ఎలా నడుస్తుంది. నాన్ డిటెన్షన్ సిస్టమ్ ప్రకారం 7వ తరగతి కామన్ బోర్డ్ పరీక్ష విధానాన్ని ఎత్తివేసిన అధికారులు 1 నుండి 9 తరగతి వరకు పరీక్షలోని మార్కులతో సంబంధం లేకుండానే పై తరగతికి పంపించాలి ఉండగా మార్కులకు ఆ ప్రాధాన్యత లేదని, ప్రాధాన్యత లేని అంశపట్ల సంస్కరణల పేరుతో డబ్బులు వృదా చేయడం, ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేయడం సరైనది కాదని, తరగతికి ఒక ఉపాధ్యాయుని పెట్టాలని, జి.ఓ. 25 సవరించాలని గత కొన్నేళ్ళుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తువుంటే పట్టించుకొని అధికారులు కనీసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కూడ నిర్వహించడానికి తీరికలేని అధికారులు స్వచ్ఛంద సంస్థలు చెప్పిన సలహాలు పాటిస్తూ విద్యారంగంలో ప్రయోగాలు చేస్తున్నారని 20 ఏళ్ళుగా ఇలాంటి ప్రయోగాలకు తెరలేపిన అధికారులు అవి విఫలం చెందిన ప్రతిసారి కొత్త పేరుతో విద్యారంగంలో నాణ్యతతోపాటు ఉపాధ్యాయుల్లో ఉన్న బోధన ఆసక్తిని కూడ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి బాహ్య మూల్యాంకనం యొక్క విశిష్టత ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో భవిష్యత్తులో అధికారుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం



