Tuesday, 19 May 2026
  • Home  
  • పెరంగుడిపల్లిలో గురుకుల పాఠశాల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెరంగుడిపల్లిలో గురుకుల పాఠశాల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి

పెరంగుడిపల్లిలో గురుకుల పాఠశాల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి కనిగిరి మండలం పెరంగుడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 13 తరగతి గదులు, 23 హాస్టల్ గదులు, వంటశాల నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించేలా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. విదేశీ విద్య అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా పాఠశాల అభివృద్ధి చేయాలని తెలిపారు. నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, పనులను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పెరంగుడిపల్లిలో గురుకుల పాఠశాల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి మండలం పెరంగుడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 13 తరగతి గదులు, 23 హాస్టల్ గదులు, వంటశాల నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించేలా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. విదేశీ విద్య అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా పాఠశాల అభివృద్ధి చేయాలని తెలిపారు. నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, పనులను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.