మురారి, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించిన సందర్భంగా బిక్కవోలు మండల టీడీపీ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి (బుజ్జి) కుటుంబ సభ్యులు మొక్కుకున్న మొక్కును చెల్లించారు. ఈ సందర్భంగా మురారిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, సుమేఘ దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



