యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు, కూటమి నాయకులు స్పందించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్త, మురుగును క్రేన్ మెషిన్ సహాయంతో తొలగించే పనులను ప్రారంభించారు.
పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అన్నం బాబ్జి, కాండ్రకోట చిరంజీవి, శెన్నాంశెట్టి శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, భజంత్రీలు శ్రీను కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. మేము ప్రజలకు దగ్గరలోనే ఉంటాం.. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి.. పరిష్కారం కోసం కృషి చేస్తాం” అని తెలిపారు.
మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను కూడా పరిశీలించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందించేలా చేసిన పున్నమి న్యూస్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి న్యూస్ కథనానికి స్పందన.. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ క్లియరెన్స్..!
యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు, కూటమి నాయకులు స్పందించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్త, మురుగును క్రేన్ మెషిన్ సహాయంతో తొలగించే పనులను ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అన్నం బాబ్జి, కాండ్రకోట చిరంజీవి, శెన్నాంశెట్టి శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, భజంత్రీలు శ్రీను కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. మేము ప్రజలకు దగ్గరలోనే ఉంటాం.. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి.. పరిష్కారం కోసం కృషి చేస్తాం” అని తెలిపారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను కూడా పరిశీలించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందించేలా చేసిన పున్నమి న్యూస్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

