పున్నమి ప్రతినిధి ఆగస్టు 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఎండి సమీర్ పక్షవాతం కారణంగా కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకొని మంగోలి శ్రీనివాస్ గౌడ్ అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి తన వంతు సహాయంగా 50 కిలోల నాణ్యమైన బియ్యంతో పాటు కొన్ని రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం వారి స్నేహభావాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ భగవంతుడు వారికి ఎల్లవేళ సుఖ సంతోషాలు ప్రసాదించాలని బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందలు తెలుపడం జరిగింది



