ఖానాపురం పున్నమి ప్రతి నిధి: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం అభివృద్ధి అధికారి వనపర్తి అద్విత అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడుతూ. మండల సర్వసభ్య సమావేశానికి వచ్చే అధికారులు ఆయా గ్రామాలలో అభివృద్ధి పూర్తి నివేదికలతో మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు. అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధిత అధికారులు నివేదిక రూపంలో ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నంగునూరు రమేష్. ఎం సి వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు. సొసైటీ చైర్పర్సన్ వల్లే శ్రీనివాస్. ఎంపీఓ సునీల్ కుమార్. ఇన్చార్జి ఎంపిఓ సునీత. వివిధ గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



