*ఓజిలి, సెప్టెంబర్ 29, పున్నమి న్యూస్* ఓజిలి మండలంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, నియోజకవర్గ పరిశీలకులు బీరదవోలు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు-కార్యకర్తలు సమన్వయంతో పని చేయడంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఐక్యతతో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పడ్రి హరినాథ్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి దేశిరెడ్డి మధు రెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం అరుణమ్మ, మౌనిక, ప్రవీణా, ఖాదర్ బాషా, ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఓజిలిలో వైఎస్సార్సీపీ మండల స్థాయి సమావేశం* *కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ*