నెల్లూరు ఆగస్టు 30:
ఆగస్టు 29 (గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినం) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన “తెలుగు పలుకు తరతరాల వెలుగు” కవితా పోటీలో నెల్లూరులోని వేదయపాలెంలో నివాసముంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ టాప్20 లో 5వ స్థానంలో నిలిచారు. ఈ పోటీకి విశేష స్పందన లభించిందని దాదాపు 400 మంది కవులు ఉత్సాహంగా పాల్గొని తమ అద్భుతమైన కవితా ప్రతిభను చాటుకున్నారని, అందులో డాక్టర్ పీర్ కుమార్ ఐదవ స్థానం లో నిలిచారని విశ్వ సాహితీ కళావేదిక చైర్ పర్సన్ కొల్లి రమావతి తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సాహిత్యాభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి అధ్యాపకులు, విశ్వ సాహితీ కళావేదిక టీం సభ్యులు పోటీలో 5వ స్థానం పొందిన పీర్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.



