రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిది)
ముస్తాబాద్: మండల స్థాయి ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీలు నామాపూర్ జడ్పీహెచ్ఎస్లో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇతర క్రీడల్లో ప్రతిభను చాటనున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఎంఈఓ అంబటి రవీందర్ సూచించారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు. కార్యక్రమంలో బాల్‌రెడ్డి, గజ్జల రాజు, సర్పంచ్ మాదాసు అనిల్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నామాపూర్‌లో క్రీడా సంబరం మండల స్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిది) ముస్తాబాద్: మండల స్థాయి ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీలు నామాపూర్ జడ్పీహెచ్ఎస్లో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇతర క్రీడల్లో ప్రతిభను చాటనున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఎంఈఓ అంబటి రవీందర్ సూచించారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని కోరారు. కార్యక్రమంలో బాల్‌రెడ్డి, గజ్జల రాజు, సర్పంచ్ మాదాసు అనిల్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

