Monday, 24 August 2026
  • Home  
  • నామాపూర్‌లో 1,350 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ సర్పంచ్ మాదాసు అనిల్
- రాజన్న సిరిసిల్ల

నామాపూర్‌లో 1,350 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ సర్పంచ్ మాదాసు అనిల్

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి) నామాపూర్ గ్రామంలో అర్హులైన 1,350 పైచిలుకు కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్, జీపీఓ, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో 400కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. సన్నబియ్యం పథకం దుర్వినియోగం కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి)
నామాపూర్ గ్రామంలో అర్హులైన 1,350 పైచిలుకు కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్, జీపీఓ, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో 400కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. సన్నబియ్యం పథకం దుర్వినియోగం కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.