రేపల్లెవాడ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కార్యకర్తల తరలింపు
సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో
జులై 10 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
రేపల్లెవాడ గ్రామపంచాయతీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు రేపల్లెవాడ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా తరలివెళ్లారు.
రేపల్లెవాడ గ్రామ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో
ఈ తరలింపు కార్యక్రమం జరిగింది. సభను విజయవంతం చేసేందుకు గ్రామం నుండి
కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, యువకులు, సీనియర్ నాయకులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరావు జిల్లా సెక్రెటరీ సామిల్ నిమ్మల నరేందర్ ఉప సర్పంచ్ వీరభద్రం కరియావుల నరసింహారావు కిషోర్ నరేష్ సబస్తియన్ తో పాటు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలిపేందుకు సభకు వెళ్తున్నామని కార్యకర్తలు తెలిపారు.
సభకు బయలుదేరే ముందు సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మనమందరం కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
అనంతరం TGSRTC బస్సులో కార్యకర్తలంతా సభా ప్రాంగణానికి ఉత్సాహంగా బయలుదేరారు.



