ఖమ్మంనగరంలోని 24వ డివిజన్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత, బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.), పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలనందం, ASR జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గోవిందు రావు, 3H ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. కార్యక్రమంలో గజ్జెల శ్రీనివాస్, ఆత్మకూరి నాగేశ్వరరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నషాముక్త్ సమాజం కోసం అందరూ కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.



