తిరుపతి రూరల్ ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి
వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం లక్ష్మిదేవి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పలువురు మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పుష్పాలు, పసుపు, కుంకుమ సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మిదేవికి రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి వరలక్ష్మీ వ్రతంను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపతో తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో వ్రతం ఆచరించిన మహిళలకు చెవిరెడ్డి లక్ష్మీ చేతులు పసుపు, కుంకుమలను అందజేశారు.



