Friday, 21 August 2026
  • Home  
  • స్థానిక ఎన్నికల కమిటీలో యనమల భాస్కర్‌కు చోటు… కమిటీ సభ్యుడిగా నియామకంపై ఆనాల సునీల్ శుభాకాంక్షలు
- తిరుపతి

స్థానిక ఎన్నికల కమిటీలో యనమల భాస్కర్‌కు చోటు… కమిటీ సభ్యుడిగా నియామకంపై ఆనాల సునీల్ శుభాకాంక్షలు

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పన కోసం పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో యనమల భాస్కర్‌కు చోటు కల్పిస్తూ శుక్రవారం పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కమిటీ విధివిధానాలను రూపొందించనుంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడిగా నియమితులైన యనమల భాస్కర్‌ను జనసేన నాయకుడు ఆనాల సునీల్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కమిటీ కీలకంగా పనిచేస్తుందని సునీల్ ఆకాంక్షించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఎన్నికలకు సమష్టిగా సిద్ధమవుతామని జనసేన వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.