Saturday, 9 May 2026
  • Home  
  • తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్

తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్ ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన “తాలీం ఏ హునర్” కార్యక్రమం పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీప వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే అరుదైన విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సమాజ అభివృద్ధికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటి ఆదాయాన్ని సమాజ సంక్షేమానికి వినియోగిస్తున్న అబ్దుల్ అజీజ్ పనితీరును ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో వక్ఫ్ బోర్డులో మరిన్ని సంస్కరణలు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్
ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన “తాలీం ఏ హునర్” కార్యక్రమం పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీప వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే అరుదైన విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సమాజ అభివృద్ధికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటి ఆదాయాన్ని సమాజ సంక్షేమానికి వినియోగిస్తున్న అబ్దుల్ అజీజ్ పనితీరును ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో వక్ఫ్ బోర్డులో మరిన్ని సంస్కరణలు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.