అంబేద్కర్ కోనసీమ జిల్లా..అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలోని మెట్ల కాలనీకి చెందిన అడబాల సాయి గురు దత్త రావులపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7న తుది శ్వాస విడిచాడు. మృతుడు గురు దత్త సాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పార్టీ సభ్యత్వం (రూ.100లు) పొందడంతో రూ. 5లక్షలు ప్రమాద బీమా వర్తించిందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.పార్టీకి అందించిన సేవలను గుర్తించుకుని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబ సభ్యుని బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులతో పాటు జనసైనికులు పాల్గొన్నారు.



