రామచంద్రాపురం ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి
స్థానిక జల భద్రత, సహజ వనరుల సుస్థిర నిర్వహణ
ఎదురవుతున్న సవాళ్లు, వినూత్న పరిష్కారాలు మరియు భవిష్యత్ వ్యూహాల పై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ ను వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం, మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. “జల భద్రత- సహజ వనరుల సుస్ధిర నిర్వహణ” అనే అంశం పై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ మంగళవారం తో ముగిసింది. ఈ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో కీనీట్ స్పీకర్ మరియు రిసోర్స్ పర్సన్ గా ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ జియాలజీ విభాగాధిపతి డా. ఎస్.
రాజు సిద్ధి మాట్లాడుతూ. స్థానిక జల వనరుల భద్రతతో పాటు సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా సుస్థిరంగా నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ వర్క్ షాప్ ఘనంగా నిర్వహించినందుకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ భూపతి నాయుడు శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం. నిరంజన్ బాబు మాట్లాడుతూ సహజ వనరుల పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి కోసం సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్య క్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్యి, వైన్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు, బోధన సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులను అందచేసారు.








