ఈ ఫోటోలోని బాలుడిని చూడండి… స్కూల్‌కి వెళ్తున్నాడు, మంచిదే. కానీ తను తన మత చిహ్నమైన టోపీని ధరించి మరీ వెళ్తున్నాడు. విద్యతో పాటు తన మత ధర్మాలు, సిద్ధాంతాలను చిన్నప్పటినుండే తనలో ఆకలింపు చేసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు దానికి అనుమతిస్తున్నారు, చదివే స్కూలు కూడా అభ్యంతరం చెప్పడం లేదు.
నేను వీళ్ళని ఎప్పుడూ తప్పు పట్టడం లేదు, విమర్శించడం లేదు. కానీ నాకనిపించే ఒకే ఒక ప్రశ్న… ఇలాంటి వ్యవస్థ హిందూ సమాజానికి ఎందుకు లేదు? మన హిందూ సమాజంలో కనీసం మన పిల్లలకి నుదుట బొట్టు కూడా పెట్టుకోనివ్వని దౌర్భాగ్య స్థితిలో నేడు తల్లిదండ్రులు ఉన్నారు. చాలా చోట్ల దానిని కూడా ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి.
మరి మన హిందూ విద్యారంగంలో, మన సమాజంలో ఈ మాత్రం మత స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? మన పిల్లలకు మన సంస్కృతిని, ధర్మాన్ని చిన్నప్పటి నుండే నేర్పించే స్వేచ్ఛ మనకు ఎందుకు లేకుండా పోయింది?


