రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): సమాజంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే జర్నలిస్టులు ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం పోలీస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా మహాసభకు ఆయన అతిథిగా హాజరై ప్రసంగించారు.
వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా జర్నలిస్టులు సమాజంలో మార్పునకు దోహదపడుతున్నారని భరత్ రామ్ కొనియాడారు. జర్నలిస్టులు లేకపోతే సమాజం అస్తవ్యస్తంగా మారే పరిస్థితి ఉంటుందని, మెరుగైన సమాజ నిర్మాణంలో మీడియా రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజమహేంద్రవరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశానని భరత్ రామ్ తెలిపారు.



