తాను ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలో తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోరని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఫ్యాక్షనిజంతో నిండిపోయాయని, ప్రజా సంక్షేమం, భద్రత, అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. మూడో రాజకీయ శక్తి అవసరమనే ఉద్దేశంతో కొత్త పార్టీ స్థాపిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీలో 66 శాతం సీట్లు యువతకు, అందులో 33 శాతం మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమావేశాల అనంతరం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామన్నారు. రెండేళ్లుగా జగన్‌తో ఫోన్ సంభాషణలు లేవని, ఏ కూటమితోనూ తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

సీఎం అభ్యర్థిని కాదు: విజయసాయిరెడ్డి