Tuesday, 18 August 2026
  • Home  
  • చిట్వేల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- తిరుపతి

చిట్వేల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిట్వేల్: తిరుపతి జిల్లా చిట్వేల్‌లో వికలాంగుల పింఛన్‌దారుల సంక్షేమ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంఘం అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, వికలాంగ సోదర సోదరీమణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రయ్య మాట్లాడుతూ చిట్వేల్ మండలం గట్టుమీదపల్లిలోని వికలాంగుల కాలనీలో లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి కాలనీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, తహసీల్దార్, హౌసింగ్ ఏఈలను కోరారు. కాలనీ లేఅవుట్‌లోని ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ వికలాంగులను బెదిరిస్తున్నారని, ప్రతి లబ్ధిదారుడి ప్లాట్‌ను వారికి అప్పగించి రక్షణ కల్పించాలని తహసీల్దార్, వీఆర్వోలను విజ్ఞప్తి చేశారు. నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ప్రభుత్వం ద్వారా బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్లు, సంకర కర్రలు, వినికిడి యంత్రాలు తదితర సహాయక పరికరాలను మంజూరు చేయాలని కోరారు. నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్. నరసింహరాజు, ఎం. సుబ్బారాయుడు, డి. వెంకటయ్య, టి. నాగేశ్వరరావు, వై. నారాయణ, ఇ. ఈశ్వరయ్య, జి. విశ్వనాథ్‌తో పాటు పలువురు వికలాంగులు, ప్రజలు పాల్గొన్నారు.

చిట్వేల్: తిరుపతి జిల్లా చిట్వేల్‌లో వికలాంగుల పింఛన్‌దారుల సంక్షేమ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంఘం అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, వికలాంగ సోదర సోదరీమణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రయ్య మాట్లాడుతూ చిట్వేల్ మండలం గట్టుమీదపల్లిలోని వికలాంగుల కాలనీలో లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి కాలనీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, తహసీల్దార్, హౌసింగ్ ఏఈలను కోరారు. కాలనీ లేఅవుట్‌లోని ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ వికలాంగులను బెదిరిస్తున్నారని, ప్రతి లబ్ధిదారుడి ప్లాట్‌ను వారికి అప్పగించి రక్షణ కల్పించాలని తహసీల్దార్, వీఆర్వోలను విజ్ఞప్తి చేశారు.
నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ప్రభుత్వం ద్వారా బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్లు, సంకర కర్రలు, వినికిడి యంత్రాలు తదితర సహాయక పరికరాలను మంజూరు చేయాలని కోరారు. నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్. నరసింహరాజు, ఎం. సుబ్బారాయుడు, డి. వెంకటయ్య, టి. నాగేశ్వరరావు, వై. నారాయణ, ఇ. ఈశ్వరయ్య, జి. విశ్వనాథ్‌తో పాటు పలువురు వికలాంగులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.