శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : రేణిగుంట మండల పరిధిలోని నల్లాపాళెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రీ సర్వే ప్రాజెక్టు – పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం’ శనివారం అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులతో కలిసి నల్లాపాళెం గ్రామ లబ్ధిదారులైన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా మరియు పారదర్శకమైన భూ పరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృఢమైన అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. భూ వివాదాలకు తావులేకుండా రైతుల హక్కులను కాపాడడానికే ఈ రీ సర్వే ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.

ఘనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ-ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల బృందమ్మ