Wednesday, 19 August 2026
  • Home  
  • ఘనంగా నాగుల పంచమి వేడుకలు
- నిర్మల్

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా ముధోల్ :మండలకేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో గల పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కళ్ళను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. గ్రామాల్లోని ఆలయాల్లో నాగుల పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పురాతన ఆలయమైన శ్రీ జఠశంకర ఆలయం, శ్రీ పశుపతినాథ్ శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు.

పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా ముధోల్ :మండలకేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో గల పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కళ్ళను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. గ్రామాల్లోని ఆలయాల్లో నాగుల పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పురాతన ఆలయమైన శ్రీ జఠశంకర ఆలయం, శ్రీ పశుపతినాథ్ శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.