పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో గ్రీన్ గణేష్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. GVMC హైస్కూల్, రాజా థియేటర్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో 3,500 మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకథ పుస్తకాలు, పూజా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయకులను వినియోగించడం ద్వారా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని ఆయన అన్నారు. గ్రీన్ క్లబ్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. క్లబ్ వ్యవస్థాపకులు కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


