శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలంలోని వేడం గ్రామంలో వెలసిన శ్రీ కాళికామాత దేవి ఆలయంను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి, దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన బృందమ్మకు అర్చకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని, శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రత్యేక అర్చనల్లో పాల్గొని ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ఆశీర్వాదాలు కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బొజ్జల కుటుంబ సభ్యులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

కాళికామాతను దర్శించిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ